మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో విజయ్‌

nanireddy
Updated on: 24 Dec 2018 4:34 PM IST
మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో విజయ్‌
X

సక్సెస్ ఫుల్ కుర్రహీరో విజయ్ దేవరకొండ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఒకే చెప్పాడు. ఇటీవల ట్యాక్సీవాలా విజయంతో ఊపుమీదున్న విజయ్.. తమిళ సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ లో సరికొత్త తరహా చిత్రాలను తెరకెక్కిస్తున్న డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ శ్రీ కార్తీక్‌ ను దర్శకుడి పరిచయం చేస్తూ ఓ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణతో పాటు యోగిబాబులు నటించనున్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ 'డియర్‌ కామ్రేడ్‌' తో పాటు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు.

nanireddy

nanireddy

Next Story