విజయ్‌ దేవరకొండకు తప్పిన ప్రమాదం

విజయ్‌ దేవరకొండకు తప్పిన ప్రమాదం
x
Highlights

వరుస హిట్లతో మాంచి ఊపుమీదున్న యువహీరో విజయ్ దేవరకొండ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం విజయ్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలోనటిస్తున్నారు....

వరుస హిట్లతో మాంచి ఊపుమీదున్న యువహీరో విజయ్ దేవరకొండ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం విజయ్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలోనటిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల లడక్‌లో షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కాకినాడలో షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే కాకినాడలో షూటింగ్‌లో భాగంగా కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి పట్టుతప్పి కిందపడిపోబోయారు విజయ్‌. అదృష్టవశాత్తు పట్టుచిక్కి ట్రైన్‌ ఎక్కారు. ఈ ఘటనలో చేతికి గాయమైంది. గాయం చిన్నదే అయినా.. ఒకవేళ పట్టుతప్పి పడిపోయి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని చిత్ర యూనిట్ అంటోంది. కాగా షూటింగ్‌లో గాయపడిన విజయ్‌ జీవితంలో ఏదీ ఊరికే రాదు.. గాయాలతో కూడా పండగ చేసుకోవాలి అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్ట్ చేశారు. ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో విజయ్‌తో మంచి హిట్‌ పెయిర్‌ అనిపించుకున్న రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' 'గీత గోవిందం' వంటి భారీ హిట్ చిత్రాలు తన ఖాతాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది గూగుల్‌లో నెటిజన్లు వెతికిన సౌత్‌ ఇండియా టాప్‌ ట్రెండింగ్‌ స్టార్ల జాబితా 'టాప్‌ ట్రెండింగ్‌ సౌత్‌ ఇండియన్‌ మూవీ స్టార్స్‌ 2018' విభాగంలో విజయ్‌ దేవరకొండ నాలుగో స్థానంలో నిలిచారు. అలాగే సెలబ్రిటీల సంపాదన ఫోర్బ్స్ జాబితాలో 72వ స్థానంలో నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories