మరో మంచి చిత్రం వేదం

మరో మంచి చిత్రం వేదం
x
Highlights

క్రిష్ దర్శకత్వంలో వచ్చిన మరో మంచి చిత్రం వేదం. 2009 లో విడుదలైన ఈ సినిమా బాగా ఆలోచింపచేసేది.. . ఇందులో మంచు మనోజ్, అల్లు అర్జున్, అనుష్క, మనోజ్ బాజ్...

క్రిష్ దర్శకత్వంలో వచ్చిన మరో మంచి చిత్రం వేదం. 2009 లో విడుదలైన ఈ సినిమా బాగా ఆలోచింపచేసేది.. . ఇందులో మంచు మనోజ్, అల్లు అర్జున్, అనుష్క, మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా కొన్ని సంభాషణలు .. అలా దిగిపోతాయి.. అవి “తనలో పాట హృదయాంతరాలలో నుండి కాకుండా పెదవుల పై నుండి మాత్రమే వస్తుంది” అని చక్రవర్తికి తన ప్రేయసి చెప్పే సంభాషణ. అలాగే లంచాలకి అలవాటు పడ్డ పోలీసు అధికారిని సరోజ ప్రశ్నించే సమయంలో చెప్పే సంభాషణ: "మేం బట్టలు విప్పి అమ్ముడు పోతాం, మీరు బట్టలు వేసుకొని అమ్ముడు పోతారు!" ఇంకా ... దొంగ తనాలకి పాల్పడుతున్న రాజు కి భంగ్ కాలుస్తున్న ఒక స్వామీజీ "మనిషి దొంగ నోట్లను చేస్తే నోటు మనిషిని దొంగ చేస్తుంది. గొప్పదనం అన్నది డబ్బులో కాదు నాయనా, హృదయంలో ఉంటుంది" అని చెప్పటం, దానికి రాజు, "పెరుగువడలో పెరుగు ఉంటుంది, కానీ పులిహోరలో పులి ఉండదు. అది కాలిస్తే ఇటువంటివి నేను కూడా ఇంకో నాలుగు మాటలు చెప్తా!" అని బదులివ్వటం. నీ గురించి నలుగురికి ఏం చెప్పాలని తల్లి అడిగితే.... ఏదో ఒక రోజు నా గురించే నీకంతా గొప్పగా చెబుతారు అని చక్రవర్తి (మంచు మనోజ్ కుమార్) సమాధానమిస్తాడు. ఇలా ఎన్నో సంభాషణలు రక్తికట్టించాయి. మీరు ఇప్పటివరుకు చూడకుంటే.. ఒక సారి చూడవచ్చు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories