జనసేన పార్టీకి విరాళం ఇచ్చిన వరుణ్ తేజ్, నాగబాబు.. ఎంతంటే..

nanireddy
Updated on: 28 Dec 2018 12:14 PM IST
జనసేన పార్టీకి విరాళం ఇచ్చిన వరుణ్ తేజ్, నాగబాబు.. ఎంతంటే..
X

ప్రస్తుతం జనసేన పార్టీకి విరాళాలు అందుతున్నాయి. ఈ క్రమంలో సినీనటులు, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, ఆయన కుమారుడు వరుణ్ తేజ్ పార్టీ తమవంతు విరాళాలు అందించారు. వరుణ్ తేజ్ కోటి రూపాయలు, నాగబాబు 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వరుణ్ తేజ్ కోటి రూపాయలు, నా సోదరుడు నాగబాబు 25 లక్షలు జనసేన పార్టీకి విరాళం ప్రకటించారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది పార్టీ కోసం క్రిస్మస్ కానుకగా వచ్చింది. మీరు ఇద్దరూ ఇచ్చిన విరాళానికి నేను నిజంగా గొప్పవాడిని. నేను తిరిగి వచ్చినప్పుడు, నా కృతజ్ఞతను తెలియచేయడానికి నేను మిమ్మల్ని కలుస్తాను' అని ట్వీట్ చేశారు పవన్.

nanireddy

nanireddy

Next Story