వైసీపీకి మరో షాక్...త్వరలోనే పార్టీ మారనున్న కీలక నేత

వైసీపీకి మరో షాక్...త్వరలోనే పార్టీ మారనున్న కీలక నేత
x
Highlights

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీని వదిలి టీడీపీలో చేరారు. ఇక సెకండరీ కేడర్ కూడా...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీని వదిలి టీడీపీలో చేరారు. ఇక సెకండరీ కేడర్ కూడా పెద్దఎత్తున వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయింది. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఆ పార్టీకి మరిన్ని దెబ్బలు తప్పేలా లేవు. ఇందుకు తాజా ఉదాహరణ వంగవీటి రాధా. పార్టీ పటిష్టత, అధికారమే లక్ష్యంగా ఆపార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా... ఒక్కోక్కరుగా నాయకులు వెళ్లిపోతూనే ఉన్నారు. ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలను కోల్పోయిన వైసీపీ... తాజాగా మరో మాజీ ఎమ్మెల్యేను కూడా కోల్పోనుంది. విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈనెల 22నగాని లేక 23వతేదీనగాని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అధికార తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. విజయవాడకు చెందిన మరో వైసీపీ నేత పూనూరు గౌతమ్‌రెడ్డితో రాధకు విభేదాలు వచ్చినప్పుడు పార్టీ నుంచి తగిన రీతిలో మద్దతు లభించలేదని, దీంతో మనస్థాపానికి గురైన రాధ వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories