వైసీపీని వీడనున్నవంగవీటి రాధ..జోరుగా ప్రచారం..?

X
Highlights
విజయవాడ వైసీపీలో వ్యూహాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వైసీపీని...
arun30 Jan 2018 9:55 AM GMT
విజయవాడ వైసీపీలో వ్యూహాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగడంతో పార్టీ అధినేత వై.ఎస్.జగన్ విజయవాడపై దృష్టిపెట్టారు. దీంతో వంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గౌతంరెడ్డిని మళ్లీ దగ్గరకు చేర్చుకున్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్‌ను గౌతంరెడ్డి కలుసుకున్నారు. విజయవాడ సెంట్రల్ సీటు కోసం ఇప్పటికే వంగవీటి రాధా, మల్లాది విష్ణు పోటీపడుతుంటే... ఇప్పుడు గౌతంరెడ్డి రాక ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. దీంతో విజయవాడ వైసీపీలో ఏం జరగబోతుందని ఆపార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
Next Story