వచ్చాడయ్యో సామి!

వచ్చాడయ్యో సామి!
x
Highlights

ఈ మద్య కాలంలో వచ్చిన “భరత్ అనే నేను” సినిమాలోని రామజోగయ్య శాస్త్రి వ్రాసిన కైలాష్ ఖీర్, దివ్య కుమార్ పాడిన ఒక చక్కటి పాట... వచ్చాడయ్యో సామి! ముసలి...

ఈ మద్య కాలంలో వచ్చిన “భరత్ అనే నేను” సినిమాలోని రామజోగయ్య శాస్త్రి వ్రాసిన కైలాష్ ఖీర్, దివ్య కుమార్ పాడిన ఒక చక్కటి పాట... వచ్చాడయ్యో సామి!

ముసలి తాతా ముడత ముఖం
మురిసిపోయనే…మురిసిపోయనే
గుడిసె పాకా గుడ్డి దీపం
మెరిసిపోయనే…మెరిసిపోయనే
రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళో గంటా
రంగ రంగ సంభరంగ మోగెనే

వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ..
ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ.
వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ
ఓ…ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ

కత్తి సుత్తి పలుగు పార తియ్యండీ
మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టూగ పెట్టండి
మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టూగ పెట్టండి
అన్నం పెట్టె పని ముట్లే మన దేవుళ్ళు
మన ఆయుదాల పూజలు చేద్దం పట్టండీ
అమ్మోరు కన్ను తెరిచిన నవ రాతిరీ
ఇన్నాళ్ళ చిమ్మ చీకటి తెల్లారె సమయం కుదిరి

వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ..
ఓ…ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ

ఓ.. మట్టి గోడలు చెబుతాయీ సీమ మనుషుల కష్టాలూ
ఈ…దారి గతుకులు చెబుతాయీ పల్లె బ్రతుకుల చిత్రాలూ
పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లెవైపేగా
అస్సలైనా పండగ ఎపుడంటే ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా
ఓ నాడు కళకళ వెలిగిన రాయలోరి సీమిది
ఈ నాడు వెల వెల బోతే ప్రాణమంత చినబోతుంది

వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ..
ఓ..ఓ… ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
చేతి వ్రుత్తులు నూరారూ చేవకలిగిన పనివారూ
చెమట బొట్టుల తడిలోనే తళుక్కుమంటది ప్రతి ఊరూ
ఎండపొద్దుకి వెలిగిపోతారూ ఈ అందగాల్లూ వాన జల్లుకు మెరిసిపోతారూ
ఎవ్వరికన్నా తక్కువ పుట్టారూ వీల్లందరిలాగే బాగ బ్రతికే హక్కు ఉన్నోళ్ళూ
పల్లెట్టూల్లు పట్టుకొమ్మ లని వట్టి జోల పాట పాడకా
తల్లడిల్లు తలరాతలకు సాయమేదొ చెయ్యాలంట

వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ
ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ.
ఈ పాటకి సంగీతం అందించింది... హిట్ మీద హిట్ కొడుతున్న మన దేవిశ్రీ ప్రసాద్. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories