కొడుకు ప్రేమించాడని..తల్లిపై అత్యాచారం

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తమ కుమార్తెను ప్రేమించి ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయాడనే కోపంతో యువకుడి...
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తమ కుమార్తెను ప్రేమించి ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయాడనే కోపంతో యువకుడి కుటుంబం పట్ల అమానుషంగా ప్రవర్తించారు ఆమె కుటుంబసభ్యులు. యువకుడి కుటుంబాన్ని కిడ్నాప్ చేయడమేగాక.. అతడి తల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బోపురా గ్రామానికి చెందిన ఓ యువకుడు(26), ముజఫర్‌నగర్‌కు చెందిన మరో యువతి(24)ని ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ ఘజియాబాద్‌లో చదువుకుంటున్నారు. ఈ ప్రేమికులిద్దరూ నవంబర్ 20న ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. మొత్తానికి తమ కూతురు ఆచూకీ వారి తల్లిదండ్రులకు లభించలేదు. ఆ నోట ఈ నోట యువతి తల్లిదండ్రులకు వీరి ప్రేమ వ్యవహారం తెలిసింది. దీంతో యువకుడి తల్లిదండ్రులు, అన్న, బావను డిసెంబర్ 25న ప్రేమికురాలి కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారు. అనంతరం ప్రేమికుడి తల్లిపై యువతి కుటుంబీకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. యువతి ఇంటిపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అరెస్టు అయిన వారిలో యువతి తండ్రి, ఇద్దరు సోదరులు, మాజీ గ్రామ సర్పంచ్ ఉన్నారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT