మత గురువుకు శిష్యురాళ్ల దేహశుద్ధి

ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో మత గురువుకు శిష్యురాళ్లు దేహశుద్ధి చేశారు. ఆశ్రమం నుంచి గురువును బంధువుల సాయంతో...
ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో మత గురువుకు శిష్యురాళ్లు దేహశుద్ధి చేశారు. ఆశ్రమం నుంచి గురువును బంధువుల సాయంతో జట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చారు. అర్ధనగ్నం చేసి లాఠీలతో చితకబాదారు. భగవద్గీత నేర్పిస్తానని శిష్యురాళ్లను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు కామాంధ గురువు.
మథురలో వాసుదేవ్ అనే ఈ మత గురువు భగవద్గీత బోధన క్యాంపు నిర్వహిస్తున్నారు. ఇతడి ఆశ్రమంలో పలువురు అమ్మాయిలున్నారు. మంచి విద్యా బుద్ధులు నేర్పిస్తానని మహారాష్ట్రకు చెందిన యువతిని నమ్మంచి ఆశ్రమానికి తీసుకువచ్చాడు. శిష్యురాళ్లను నిర్బంధించి వేధిస్తున్నాడు. కేవలం తల్లిదండ్రులతో తన సమక్షంలోనే మాట్లాడించేవాడు. మహారాష్ట్ర శిష్యురాలిని లైంగికంగా వేధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలను రహస్యంగా తీశారు శిష్యురాళ్లు.
గురువు వాసుదేవ్ లైంగిక వేధింపులపై బాధితురాలు తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపింది. మహారాష్ట్ర నుంచి ఆమె తల్లి, మామ, సోదరుడు మథుర వచ్చారు. ఆశ్రమం నుంచి గురువు జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకు వచ్చారు. అతడి అత్యాచారాల గురించి నిలదీసి దేహశుద్ధి చేశారు. కామాంధ గురువును బాధిత యువతులు లాఠీలతో చితకబాదారు. తర్వాత నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయ్యాగారి రాసలీలల వీడియో, ఫోటోలను అందజేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT