ముగిసిన కాంగ్రెస్ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ భేటీ...95 స్థానాల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్

ముగిసిన కాంగ్రెస్ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ భేటీ...95 స్థానాల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్
x
Highlights

ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ భేటీ ముగిసింది. ఈ నెల 8న మరోసారి భేటీకావాలని కాంగ్రెస్ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ...

ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ భేటీ ముగిసింది. ఈ నెల 8న మరోసారి భేటీకావాలని కాంగ్రెస్ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ నిర్ణయించింది. ఈ నెల 8 లేదా 9 తేదీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఇవాళ కేవలం 57 స్థానాలపై చర్చ జరిగిందని.. మొత్తం 95 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుందని ఉత్తమ్ తెలిపారు. టిడీపీతో 14 సీట్లకు అంగీకారం కుదిరిందని.. తెజస, సీపీఐతో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని ఉత్తమ్‌ చెప్పారు. మొత్తం 95 స్థానాల్లో కాంగ్రెస్‌ బరిలో ఉంటుందని, మిగతా 24 స్థానాల్లో మిత్రపక్షాలు పోటీ చేస్తాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories