టీఆర్ఎస్ కు త్వరలో భారీ షాక్...కాంగ్రెస్ లోకి...

టీఆర్ఎస్ కు త్వరలో భారీ షాక్...కాంగ్రెస్ లోకి...
x
Highlights

టీఆర్ఎస్‌కు చెందిన చాలా మంది నేతలు కేసీఆర్‌కు భారీ షాక్ ఇవ్వబోతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్‌కు చెందిన చాలా మంది పెద్ద...

టీఆర్ఎస్‌కు చెందిన చాలా మంది నేతలు కేసీఆర్‌కు భారీ షాక్ ఇవ్వబోతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్‌కు చెందిన చాలా మంది పెద్ద నేతలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని మీడియాతో చిట్ చాట్ గా చెప్పారు. టీఆర్ఎస్ ముఖ్యులు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బొక్కబోర్లా పడటం ఖాయమని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత సర్వే ప్రకారం రాష్ట్రంలో మహాకూటమి 80 స్థానాలకు పైగా గెలవబోతుందని, టీఆర్ఎస్ 20 సీట్లకే పరిమితం కాబోతుందని ఉత్తమ్ చెప్పుకొచ్చారు.

మహాకూటమి ఉమ్మడి మేనిఫెస్టో ముసాయిదా ఇప్పటికే రెడీ అయిందని ఉత్తమ్ తెలిపారు. అయితే సీట్ల సర్దుబాటే ఇంకా ఓ కొలిక్కి రాలేదన్నారు. సీట్ల కేటాయింపుపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. కోదండరాంతో చర్చలు కొనసాగుతున్నాయని ఉత్తమ్ వివరించారు. మహాకూటమి పేరు మారుస్తామని ఉత్తమ్ తెలిపారు. తెలంగాణలో అమిత్ షా టూర్ ఓ డ్రామా అన్న ఉత్తమ్ బీజేపీపై ఇప్పుడు ఇన్ని విమర్శలు చేస్తున్న కేసీఆర్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీకి ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories