బ్రేకింగ్: డీఎస్‌తో ఉత్తమ్ కీలక సమావేశం

బ్రేకింగ్: డీఎస్‌తో ఉత్తమ్ కీలక సమావేశం
x
Highlights

రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్‌ సొంత గూటికి చేరుకునేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పెద్దలతో టచ్‌లో ఉన్న డీఎస్‌తో పీసీసీ చీఫ్‌...

రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్‌ సొంత గూటికి చేరుకునేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పెద్దలతో టచ్‌లో ఉన్న డీఎస్‌తో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటి అయ్యారు. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించిన ఆయన కలిసి కట్టుగా నడిచి పార్టీని అధికారంలోకి తెద్దామంటూ సూచించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన డీఎస్ త్వరలోనే పార్టీలో చేరేందుకు హామి ఇచ్చినట్టు సమాచారం. తనతో పాటు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఇతర టీఆర్ఎస్ ‌అసంతృప్తులను కాంగ్రెస్‌లోకి తీసుకెళ్లేందుకు డీఎస్‌ వ్యూహాలు రచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్న నేపధ్యంలో డీఎస్‌తో భేటి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories