చంద్రబాబుతో ఉత్తమ్‌ భేటీ..సీట్ల ముడిపై..

nanireddy
Updated on: 24 Dec 2018 3:41 PM IST
చంద్రబాబుతో ఉత్తమ్‌ భేటీ..సీట్ల ముడిపై..
X

మహాకూటమి సీట్ల సర్దుబాటులో సస్పెన్స్ ను తొలగించేందుకు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు. ఒకట్రెండు రోజుల్లో మిత్రపక్షాల మధ్య ఉన్న సమస్యల్ని కొలిక్కి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగా పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఢిల్లీలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీ భవన్‌లోని సీఎం కాటేజీలో చంద్రబాబుని.. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కలిశారు. ఈ భేటీలో మహాకూటమి బలాబలాలపై చర్చించారు. సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహం, ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక, ప్రచార వ్యూహం ఎలా ఉండాలనేదానిపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఈ చర్చలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా పాల్గొన్నారు. అంతకుముందు.. సీపీఐ నేతలు కూడా చంద్రబాబును కలిశారు.

nanireddy

nanireddy

Next Story