15 వీడియోల్లో గజల్ శ్రీనివాస్..?

లైంగిక వేధింపుల కేసులో అరెస్టై ఊచలు లెక్కపెడుతున్న గజల్ శ్రీనివాస్ గురించి మరికొన్ని సంచలన విషయాలు...
లైంగిక వేధింపుల కేసులో అరెస్టై ఊచలు లెక్కపెడుతున్న గజల్ శ్రీనివాస్ గురించి మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఆలయవాణి వెబ్ ఛానల్ లో పని చేసే ఉద్యోగి కుమారి తనని గజల్ శ్రీనివాస్ లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాధితురాలితో గజల్ బలవంతంగా మసాజ్ చేయించుకుంటున్న వీడియోలను బాధితురాలు పోలీసులకు అందజేసింది. గజల్ ఆఫీస్‌లో బెడ్‌రూం ఏర్పాటు చేసుకున్నారంటూ దీనికి సంబంధించిన ఆధారాలను కుమారి పోలీసులకు ఇచ్చింది. అయితే బాధితురాలు అందజేసిన ఆధారాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు గజల్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఇదిలా ఉంటే గజల్ రెండో సారి బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసినట్లు తెలుస్తోంది. బెయిల్ పై బయటికి వస్తే సెలబ్రిటీ హోదాలో ఉన్న గజల్ బాధితురాలిని బెదిరించే అవకాశం ఉందని , పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్నకోర్ట్ బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించాలేదు.
కాగా కోర్టులో కేసు విచారణలో ఉండగా బాధితురాలు మరికొన్ని వీడియోలు పోలీసులకు ఇచ్చినట్లు సమాచారం.
కుమారి దాదాపు మరో 15వీడియోలు పోలీసులకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీటిలో ఆమె స్వయంగా వేధింపులకు గురైనవి కూడా ఉన్నాయని తెలుస్తోంది. తనతో పాటు పలువురు బాధితులు ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ప్రసారం చేయలేని స్థితిలో వీడియోలు ఉన్నాయని చెబుతున్నారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT