నంద్యాలలో దారుణం...ఒకేరోజు 8 షాపులు తగలబెట్టిన దుండగుడు

నంద్యాలలో దారుణం...ఒకేరోజు 8 షాపులు తగలబెట్టిన దుండగుడు
x
Highlights

కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. రాజస్థాన్ వ్యాపారులే టార్గెట్‌గా ఓ దుండగుడు పట్టణంలోని దుకాణాలను తగలబెడుతున్నాడు. ఒకే రోజు నంద్యాలలో వివిధ...

కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. రాజస్థాన్ వ్యాపారులే టార్గెట్‌గా ఓ దుండగుడు పట్టణంలోని దుకాణాలను తగలబెడుతున్నాడు. ఒకే రోజు నంద్యాలలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 8 దుకాణాలను దుండగుడు పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. గడిచిన ఉగాది పండగ రోజూ ఇదే తరహాలో 3 దుకాణాలను గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. అంతకు ముందు కూడా రెండు షాపులను తగలబెట్టినట్టు బాధితులు చెబుతున్నారు. అప్పట్లో సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల పోలీసులు లైట్‌గా తీసుకున్నారని, అందువల్లే దుండగుడు మరోసారి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని రాజస్థాన్ వ్యాపారులు చెబుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుడిని పట్టుకోవాలని బాధితులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories