ముగిసిన అనంత్‌కుమార్‌‌‌ అంత్యక్రియలు

nanireddy
Updated on: 24 Dec 2018 4:00 PM IST
ముగిసిన అనంత్‌కుమార్‌‌‌ అంత్యక్రియలు
X

అశ్రునయనాల మధ్య కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌‌‌ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన పార్థిక దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. చామరాజపేట స్మశాన వాటికలో హిందూ సంప్రదాయ ప్రకారం ఆయన పార్ధివదేహానికి సోదరుడు నందకుమార్ నిప్పంటిచారు. కాగా 59 ఏళ్ల అనంతకుమార్ కొంతకాలం బెంగళూరులోని శంకర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు….. ఆరోగ్యం మరింత విషమించడంతో నిన్న తెల్లవారుజున 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. గతంలో అమెరికాకు వెళ్లి క్యాన్సర్‌ చికిత్స తీసుకున్నారు కానీ ఫలితం లేకపోవడంతో… నెలరోజుల క్రితమే.. ఆయన బెంగుళూరులోని… శంకర ఆసుపత్రిలో చేరారు. శంకర ఆసుపత్రిలో నెలరోజులుగా.. చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోగా నిన్న(సోమవారం) తుదిశ్వాస విడిచారు.

nanireddy

nanireddy

Next Story