logo
సినిమా

టాలీవుడ్ సెక్స్ రాకెట్ జాబితాలో ఇద్దరు టాప్ హీరోయిన్లు

టాలీవుడ్ సెక్స్ రాకెట్ జాబితాలో ఇద్దరు టాప్ హీరోయిన్లు
X
Highlights

అమెరికాలో తెలుగు తారలతో చీకటి దందాకు సంబంధించి మరిన్ని కొత్త విషయాలు బయటపడుతున్నాయి. దక్షిణాదికి చెందిన ఇద్దరు ...

అమెరికాలో తెలుగు తారలతో చీకటి దందాకు సంబంధించి మరిన్ని కొత్త విషయాలు బయటపడుతున్నాయి. దక్షిణాదికి చెందిన ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు సహా పలువురికి ప్రమేయం ఉందని తెలుస్తోంది. కిషన్ మోదుగుపుడి అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి ఆయన భార్య చంద్రకళను అరెస్ట్ చేసిన పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ప్రొడక్షన్ మేనేజర్‌గా, సహనిర్మాతగా గతంలో పనిచేసిన కిషన్ తనకున్న పరిచయాలతో ఈవెంట్ల పేరిట సినీ తారలను అమెరికా రప్పించేవాడు. ఈ సెక్స్‌రాకెట్‌ నడుపుతున్న కిషన్‌, చంద్రకళ దంపతులు కేవలం ఏడాది కాలంలో ఈ పని కోసం వర్ధమాన తెలుగు, కన్నడ తారలను అమెరికాకు రప్పించేందుకు 76 విమాన టికెట్లు బుక్‌ చేశారు! ఆ నటులను అమెరికాకు బీ1, బీ2 విజిటర్‌ వీసాల మీద రప్పించడం.. గంటకు ఇంతని రేటు కట్టి వ్యభిచారం చేయించడం.. విటుల నుంచి వసూలు చేసేదాంట్లో కొంత మొత్తం తారలకు ఇచ్చి, సింహభాగం తాము తీసుకోవడం.. ఇదే వారి మోడస్‌ ఆపరెండీ. తారలను ఉంచిన హోటల్‌ రూములను సైతం కిషన్‌ దంపతులు తమ పేరునే బుక్‌ చేశారు. ఇప్పుడవే పోలీసులకు కీలక ఆధారాలుగా లభ్యమవుతున్నాయి. అంతేకాదు.. అమెరికాలో దాదాపు 40 ఏళ్ల క్రితం ఏర్పాటైన ప్రముఖ తెలుగు సంఘం ఒకటి.. తమ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పలువురు తెలుగు తారలకు వీసాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ హైదరాబాద్‌లోని కాన్సుల్‌ జనరల్‌కు రాసిన లేఖ ప్రతులు సైతం దర్యాప్తు అధికారులకు తనిఖీల్లో లభ్యం కావడం గమనార్హం. వీరి బారిన పడిన తారల్లో ఐదుగురి పేర్లను ఫిర్యాదులో నమోదు చేశారని.. బెంగళూరు, చెన్నై నగరాలకు చెందిన ఇద్దరు ప్రముఖ నటీమణుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం.

Next Story