జమ్మూకశ్మీర్‌ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

nanireddy
Updated on: 24 Dec 2018 4:35 PM IST
జమ్మూకశ్మీర్‌ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
X

జమ్మూకాశ్మీర్‌ మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా దళాలు కూంబింగ్‌ చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భారత జవాన్లు ఎదురు కాల్పులతో ధీటుగా సమాధానం ఇచ్చారు. ఇద్దరి మధ్య హోరా హోరీగా సాగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొంత మంది ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. కాగా హతమైన ఉగ్రవాదుల సంస్థ, వారి స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడం కోసం భద్రతా దళాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ సాయంత్రం కేంద్ర హోమ్ మంత్రి కూడా సిబ్బందితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే గతనెల షోపియాన్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాది, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆ సమయంలో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేశారు.

nanireddy

nanireddy

Next Story