మావోలకు షాక్.. భార్యతో పాటు లొంగిపోయిన పార్టీ మాస్టర్ బ్రెయిన్ పురుషోత్తం

మావోలకు షాక్.. భార్యతో పాటు లొంగిపోయిన పార్టీ మాస్టర్ బ్రెయిన్ పురుషోత్తం
x
Highlights

మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.. పార్టీ అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు పురుషోత్తం అలియాస్ రవి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఉదయం హైదరాబాద్ పోలీస్...

మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.. పార్టీ అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు పురుషోత్తం అలియాస్ రవి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఉదయం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ముందు భార్య వినోదినితో పాటు పురుషోత్తం లొంగిపోయాడు. పోలీసు అధికారులు వారిద్దరినీ మీడియా ముందు ప్రవేశ పెట్టారు. మావో అగ్రనేతలు ఆర్కే, గణపతి, కిషన్ లతో కలసి పురుషోత్తం 25 ఏళ్లు పని చేశారు. మావోయిస్ట్ పార్టీ మాస్టర్ బ్రెయిన్ గా ఈయనకు పేరుంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రచార కమిటీ సెక్రటరీగా పురుషోత్తం పని చేస్తున్నారు. అనారోగ్య కారణలతో అడవిన వదిలిపెట్టి, జనజీవన స్రవంతిలోకి వచ్చారు. వీరిపై రూ. 8 లక్షల వరకు రివార్డు ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories