టీఎస్‌పీఎస్సీ తరహాలో మరో రెండు రిక్రూట్‌మెంట్ బోర్డులు

టీఎస్‌పీఎస్సీ తరహాలో మరో రెండు రిక్రూట్‌మెంట్ బోర్డులు
x
Highlights

ఉద్యోగాలను భర్తీలో జరుగుతున్న జాప్యంపై కేసీఆర్ సర్కార్ దృష్టి సారించింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తరహలోనే మరో రెండు బోర్డులను ఏర్పాటు చేసి ఖాళీల...

ఉద్యోగాలను భర్తీలో జరుగుతున్న జాప్యంపై కేసీఆర్ సర్కార్ దృష్టి సారించింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తరహలోనే మరో రెండు బోర్డులను ఏర్పాటు చేసి ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవడానికి కసరత్తు చేస్తోంది. విద్య, వైద్య శాఖలో ఖాళీల భర్తీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికే కొత్త బోర్డులను ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

ఏడాదిలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు కొంతవరకు రిక్రూట్మెంట్ పక్రియను చేపట్టారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లు కోర్టుకు చేరడం ప్రభుత్వానికి తలవంపులు తెచ్చిపెడుతోంది. ఆర్థిక శాఖ దాదాపు 70 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా నోటిఫికేషన్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సామర్థం సరిపోనట్లయితే ఆయా శాఖల్లోనే రిక్రూట్‌మెంట్ బోర్డులను ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వం భావిస్తోంది.

నిజానికి చాలా ఉద్యోగాలు విద్య , వైద్య , పోలీస్ శాఖలోనే ఉన్నాయి. పోలీస్ శాఖలో తప్ప మిగతా అన్ని శాఖల ఉద్యోగాల భర్తీ పక్రియ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే చూస్తోంది. విధ్య , వైద్య శాఖల ఖాళీల భర్తీలో సీనియార్టీ, ప్రమోషన్లు వంటి అంశాలు అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా నియామక ప్రక్రియ చేపట్టడంతో కథ కోర్టుల వరకు వెళ్తోంది. గతంలో వైద్య శాఖ ఖాళీల్ని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ద్వారా భర్తీ చేసేవారు. ఈ బాధ్యతను టీఎస్‌పీఎస్సీకి అప్పగించాక గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లలకు వెయిటేజ్ ఇచ్చే నిభందన తొలగించారు. ఇది నియామక పక్రియలో అలస్యం జరిగి పీహెచ్‌సీల్లో డాక్టర్ల కొరతకు కారణమౌతోంది.

ఇక విద్యాశాఖలోనూ టీచర్స్ రిక్రూట్‌మెంట్, ప్రమోషన్ల వంటి అంశాల్లో న్యాయపరమైన సమస్యలు వస్తున్నాయి. దీంతో అరోగ్యశాఖ, విద్యాశాఖల్లో ఉద్యోగాల భర్తీకోసం ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల నాటికి లక్షకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయాలని పట్టుదలగా ఉన్న కేసీఆర్ సర్కార్ వీలైనంత త్వరగా ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో శాఖ నుంచి రిక్రూట్‌మెంట్‌లో జరుగుతున్న జాప్యం గురించి స్వయంగా సీఎం వివరాలను తెలుసుకుని ప్రత్యామ్నాయ వ్యవస్థపై తుది నిర్ణయం తీసుకొంటారని సమాచారం. ఇదే జరిగితే తెలంగాణలో కొలువుల భర్తీ వేగంవంతం అవడం ఖాయంగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories