తుది మెరుగులు దిద్దుకుంటోన్న టీటీడీపీ మేనిఫెస్టో

x
Highlights

టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రగతి భవన్ ను ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చడంతో పాటు బెల్ట్ షాపుల రద్దు, పెన్షన్ల పెంపు, ప్రభుత్వ...

టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రగతి భవన్ ను ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చడంతో పాటు బెల్ట్ షాపుల రద్దు, పెన్షన్ల పెంపు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు, రెండు లక్షల లోపు వ్యవసాయ రుణ మాఫీ వంటి హమీలకు మేనిఫెస్టోలో చోటు కల్పించారు. ముసాయిదా మేనిఫెస్టోపై కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజాకర్షక అంశాలకు చోటు కల్పించారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా మానిఫెస్టోను రూపొందించారు. ముఖ్యంగా... అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల భర్తీ, మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి, పేదింటి పిల్లల పెళ్ళిల్ల కోసం లక్షన్న ఆర్దిక సాయం, సొంతింటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు, రైతులు, కౌలు రైతులకు రెండు లక్షల పంట రుణ మాఫీ, బెల్ట్ షాపుల రద్దు, ప్రభుత్వ ఉద్యోగలు పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలకు పెంపు వంటి అంశాలను ఎన్నికల ప్రణాళికలో పెద్ద పీట వేశారు.

విద్య, వైద్య రంగాల బడ్జెట్ భారీగా పెంపు, గర్భిణిల పౌష్టికాహారానికి 15 వేలు, ప్రతి పేద వాడికి 7 కిలోల బియ్యం, 5 రూపాయల బోజన శాలల ఏర్పాటు వంటి ఎన్నో అంశాలను టీటీడీపీ మానిఫెస్టోలో చేర్చారు. అంతేకాదు..కేసీఆర్ తప్పుడు నిర్ణయాలను సరిదిద్దే విధంగా మానిఫెస్టో ఉంటుందని నేతలు చెబుతున్నారు. మొదటి నుంచి చెబుతున్న విధంగానే ప్రగతి భవన్ ను ప్రజా ఆసుపత్రిగా మార్చుతామని హమీ ఇచ్చారు. అలాగే హైదరాబాద్‌లో ధర్నా చౌక్ ను పునరుద్దరించి..తెలంగాణను ప్రజా స్వామ్యయుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రస్తుత పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయడంతో పాటు..ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీటీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదాపై ప్రస్తుతం కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. పార్టీ శ్రేణుల నుంచి వచ్చే సలహాలు, సూచనలకు అనుగుణంగా తుది ప్రణాళికను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories