టీఆర్ఎస్‌ ఓటమే లక్ష్యంగా ముందుకెళ్దాం ..

x
Highlights

మహాకూటమి పొత్తులుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీట్ల కోసం టీజేఎస్‌, సీపీఐ కాంగ్రెస్‌ను బద్నాం చేస్తున్నాయంటూ ఆరోపించారు....

మహాకూటమి పొత్తులుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీట్ల కోసం టీజేఎస్‌, సీపీఐ కాంగ్రెస్‌ను బద్నాం చేస్తున్నాయంటూ ఆరోపించారు. కాంగ్రెస్‌తో పొత్తును జాతీయ దృష్టితో చూడాలంటూ పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్ తక్కువ సీట్లు ఆఫర్ చేసిన భవిష్యత్ అవసరాలు, కేసీఆర్‌ను ఎదుర్కొనే వ్యూహంతో ముందుకు వెళదామంటూ చెప్పారు. టీఆర్ఎస్ పరాజయమే లక్ష్యంగా కేడర్ పని చేయాలని బలం, విజయావకాశాలు ఉన్న చోటే పోటీ చేద్దామంటూ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 2009లో పొత్తు సందర్భంగా టీఆర్ఎస్ 54 స్ధానాల్లో పోటీ చేసి 10 చోట్ల మాత్రమే విజయం సాధించిందని అలాంటి తప్పులు చేయవద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. పొత్తుల వల్ల అందరికి అవకాశం రాదనే వాస్తవాన్ని ఆశావాహులు అర్ధం చేసుకోవాలన్న చంద్రబాబు గెలిచాక ఎన్నో పదవులు వాస్తయనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories