ఆ వజ్రం శ్రీవారిదైతే ఆ ఇద్దరినీ అరెస్టు చేయాలి

ఆ వజ్రం శ్రీవారిదైతే ఆ ఇద్దరినీ అరెస్టు చేయాలి
x
Highlights

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి చెందిన పింక్ డైమండ్ ను జెనీవాలో వేలం వేశారనే వార్త నిజమైతే... అప్పట్లో ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులుతో పాటు...

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి చెందిన పింక్ డైమండ్ ను జెనీవాలో వేలం వేశారనే వార్త నిజమైతే... అప్పట్లో ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులుతో పాటు అప్పటి టీటీడీ ఈవో ఐవైఆర్ కృష్ణారావును కూడా అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ డీవీ రావు అన్నారు. డైమండ్ విదేశాలకు తరలిపోయేలా కస్టమ్స్ అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకుని, బుధవారం కనకదుర్గమ్మ దర్శనానికి విజయవాడ వచ్చిన ఆయన తాజా వివాదంపై విలేకరులతో మాట్లాడారు. ‘అర్చకులు కారుణ్య నియామకాలను కోరవచ్చు. కానీ రిటైర్మెంట్‌ తర్వాత వంశపారంపర్యంగా కోరడం సరికాదు. టీటీడీలో పదవీవిరమణ వయసు నిబంధన పాలసీ విషయమని హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. 1987, 2012ల్లో జారీఅయిన జీవోలను 2018లో సవాల్‌ చేసే అవకాశం లేదు. ఆ జీవోల ప్రకారం 2013లో చాలా మంది రిటైరయ్యారు’ అని గుర్తుచేశారు.

‘2001లో తన సమక్షంలో గరుడ సేవలో పింక్‌ వజ్రం పగిలిందని రమణ దీక్షితులు చెబుతున్నారు. పగిలింది రూబీ అని, వజ్రం కాదని 2010లో అప్పటి ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు నివేదిక ఇచ్చారు. జస్టిస్‌ జగన్నాథరావు కమిటీ కూడా దానిని సమర్థించింది. ఈ నేపథ్యంలో జెనీవాలో వేలం వేసిన గులాబీ వజ్రం శ్రీవారిదై ఉండవచ్చని రమణ దీక్షితులు పేర్కొనడంపై భక్తులు ఎవరైనా తమ సమీపంలోని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే.. రమణ దీక్షితులుతో పాటు కృష్ణారావును కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories