సమ్మెపై పునరాలోచించుకోండి: మంత్రి

సమ్మెపై పునరాలోచించుకోండి: మంత్రి
x
Highlights

తెలంగాణ సెక్రటేరియట్‌లో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ సత్యనారాయణ, ఎండీ రమణారావుతో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి...

తెలంగాణ సెక్రటేరియట్‌లో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ సత్యనారాయణ, ఎండీ రమణారావుతో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ రాజిరెడ్డి తెలిపారు. సంస్థను ప్రైవేట్‌పరం చేయాలని భావిస్తున్నందునే కేసీఆర్‌... అలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించి సమ్మెని నివారిస్తారో లేక... బలవంతంగా సమ్మెలోకి దించుతారో సీఎం తేల్చుకోవాలన్నారు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు.

ఇదిలా ఉంటే... ఆర్టీసీ సమ్మె యత్నంపై మంత్రి మహేందర్‌ రెడ్డి స్పందించారు. సమ్మె నిర్ణయాన్ని పునరాలోచించాలని, ఇప్పటికే 97 డిపోల్లో 11 డిపోలు మాత్రమే లాభాల్లో ఉన్నాయని మంత్రి మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ సుమారు 3వేల కోట్ల అప్పులు ఉన్నాయని, ఏటా 7వందల కోట్ల నష్టం వస్తుందన్నారు. జీతాలు పెంచితే అదనంగా సంస్థపై 14 వందల కోట్ల భారం పడుతుందన్నారు మంత్రి మహేందర్‌ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories