హైద‌రాబాద్ మెట్రో రైల్ కు ఆద‌రణ క‌రువైందా

హైద‌రాబాద్ మెట్రో రైల్ కు ఆద‌రణ క‌రువైందా
x
Highlights

హైదరాబాద్ మెట్రో రైలుపై దుష్ఫ్రచారం సాగుతోందా..? దేశంలోని మిగతా మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్ మెట్రో ఎలా ఉంది...? ప్రస్తుతం 30 కిలోమీటర్ల రూట్‌కే సరైన...

హైదరాబాద్ మెట్రో రైలుపై దుష్ఫ్రచారం సాగుతోందా..? దేశంలోని మిగతా మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్ మెట్రో ఎలా ఉంది...? ప్రస్తుతం 30 కిలోమీటర్ల రూట్‌కే సరైన ఆదరణ లభించడంలేదన్న వార్తల నేపధ్యంలో మిగతా కారిడార్ల పరిస్థితి ఏంటి..? ఎయిర్ పోర్టు‌ కనెక్టివిటీతో ముడిపడిన మెట్రో రైల్ రెండో దశ అసలు పట్టాలెక్కుతుందా..?

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై రకరకాల ప్రచారాలు సాగుతున్న నేపధ్యంలో మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా పలు పార్టీల సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. నవంబర్‌లో ప్రారంభమైన 30 కిలోమీటర్ల రూట్‌కి అంతగా ఆదరణ లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు కేటీఆర్. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో రోజుకి 60 వేల మంది వరకు ప్రయాణిస్తున్నారనీ దేశంలోని ఇతర మెట్రోలతో పోలిస్తే చాలా ఎక్కువని లెక్కలు వివరించారు.

అంతేకాదు మెట్రో కారిడార్ల ప్రారంభోత్సవంపైనా కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. మియాపూర్‌ -ఎల్బీ నగర్ కారిడార్ జులై నాటికి, నాగోల్ -హైటెక్ సిటీ రూట్ సెప్టెంబర్ వరకు, జూబ్లీ బస్ స్టేషన్ -గౌలి గూడ కారిడార్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమౌతుందని తెలిపారు. మొత్తం 72 కిలోమీటర్ల రూట్ పూర్తయ్యాక మెట్రో రైలును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు పొడిగించే పనులు ప్రారంభమౌతాయని చెప్పారు. మెట్రో రైలును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు పొడిగించే పనులు రెండేళ్ళల్లో పూర్తి చేస్తామని కేటీఆర్ స్పష్టం చేయడంతో ఈ ప్రాజెక్టుపై నెలకొన్న అనుమానాలు తీరిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories