ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ

ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ
x
Highlights

ప్రగతిభవన్ వేదికగా తెలంగాణ కేబినెట్ ఇవాళ భేటీ కానుంది. గ్రామపంచాయితీలకు స్పెషల్ అఫీసర్ల పాలనకు సంబంధఇంచి ఆర్డినెన్స్ విడుదల చేయాలన్న ప్రతిపాదనకు...

ప్రగతిభవన్ వేదికగా తెలంగాణ కేబినెట్ ఇవాళ భేటీ కానుంది. గ్రామపంచాయితీలకు స్పెషల్ అఫీసర్ల పాలనకు సంబంధఇంచి ఆర్డినెన్స్ విడుదల చేయాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కొత్తగా 9 వేల 2 వందల మంది పంచాయతీ కార్యదర్శుల నియామకానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే చాన్స్ ఉంది. ఆగస్ట్ 15న కొత్త పథకాల ప్రకటన, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్‌లో ప్రధానంగా చర్చించనున్నారు.

ఇవాళ జరిగే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా ఈ నెలాఖరుతో గడువు ముగియనున్న పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించనున్నారు. దీనికి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో కొత్తగా 4 వేల 383 పంచాయతీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో పంచాయతీ కార్యదర్శుల కొరత ఏర్పడింది. అందువల్ల ఖాళీగా ఉన్నవాటితో కలిపి మొత్తం 9 వేల 2 వందల మంది కార్యదర్శులను నియమించాలని ప్రభుత్వం డిసైడైంది. 2 నెలల్లోనే పంచాయతీ సెక్రటరీలను భర్తీచేసే విధానంపై కేబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 63 మున్సిపాలిటీలకు పాత మున్సిపాలిటీల పదవీకాలం పూర్తయ్యాక వాటితో పాటే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. అప్పటివరకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించారు. ఇక బీసీలకు సబ్సిడీ రుణాల మంజూరు, బద్వేల్‌లో ఐటీ క్లస్టర్ నిర్మాణానికి భూ కేటాయింపు, అవసరమైనప్పుడు విద్య, వైద్య, ఇంజనీరింగ్, న్యాయ నిపుణుల సర్వీసును 65 ఏళ్లకు పొడిగించి నియమించుకునేందుకు వీలుగా చట్టసవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

ప్రాణహిత నదిపై తమ్మిడిహట్టి దగ్గర నిర్మించే ప్రాజెక్టును వార్దా నదికి మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు కొన్ని శాఖల్లో ఉద్యోగాలు, పోస్టుల సృష్టికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇవి కాకుండా మరో నలభై అంశాలు టేబుల్ ఐటెమ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వపరంగా తీసుకొని అమలు చేస్తున్న అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories