టీఆర్ఎస్ 2వ జాబితా విడుదల

nanireddy
Updated on: 24 Dec 2018 4:02 PM IST
టీఆర్ఎస్ 2వ జాబితా విడుదల
X

సెప్టెంబర్ ఆరు నుంచి రోజురోజుకు ఉత్కంఠ రేపుతున్న టీఆర్ఎస్ రెండో జాబితా ఎట్టకేలకు విడుదలైంది. ఇప్పటికే 107 మంది అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ రెండోజాబితాలో 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో రెండు స్థానాలను పెండింగ్ లో పెట్టింది. కోదాడ, ముషీరాబాద్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు.

2వ జాబితా అభ్యర్థులు వీరే..
మేడ్చల్‌ – చామకూర మల్లారెడ్డి, గోషామహల్‌ – ప్రేమ్‌సింగ్‌రాథోడ్, చార్మినార్‌ – మహ్మద్‌ సలావుద్దీన్‌ లోడీ, వరంగల్‌ తూర్పు – నన్నపునేని నరేందర్, హుజూర్‌నగర్‌ – శానంపూడి సైదిరెడ్డి, వికారాబాద్‌ – డాక్టర్‌ మెతుకు ఆనంద్, అంబర్‌పేట – కాలేరు వెంకటేశ్, మల్కాజ్‌గిరి – మైనంపల్లి హనుమంతరావు, చొప్పదండి – శొంకె రవిశంకర్, ఖైరతాబాద్‌ – దానం నాగేందర్‌

nanireddy

nanireddy

Next Story