పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను మట్టి కరిపించేందుకు వ్యూహం

x
Highlights

సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ప్రతిపక్షాలకు చెక్‌ పెట్టేందుకు అధికార టీఆర్‌ఎస్‌ ప్లాన్‌ చేస్తోంది. ముందుగా పంచాయతీ పోల్స్‌లో క్లీన్‌స్వీప్‌ చేస్తే...

సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ప్రతిపక్షాలకు చెక్‌ పెట్టేందుకు అధికార టీఆర్‌ఎస్‌ ప్లాన్‌ చేస్తోంది. ముందుగా పంచాయతీ పోల్స్‌లో క్లీన్‌స్వీప్‌ చేస్తే సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఈజీగా గట్టెక్కవచ్చని లెక్కలేసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను మట్టి కరిపిస్తే సార్వత్రిక ఎన్నికల్లో ఎదురే లేకుండా పోతుందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

పంచాయతీ ఎన్నికలను ప్రీ ఫైనల్‌గా భావిస్తోంది టీఆర్‌ఎస్‌. సార్వత్రిక ఎన్నికలకు నేరుగా వెళ్లడం కంటే ముందుగా సర్పంచ్‌ ఎన్నికలకు వెళ్తే ప్రజల నాడిని పట్టొచ్చని భావిస్తోంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్‌ఎస్‌ నేతలంతా గ్రామాల్లోకి వెళ్లి మైక్రో అబ్జర్వేషన్‌ చేయడానికి అవకాశముంటుందని, దాంతో పార్టీ ఎక్కడైనా వీక్‌గా ఉంటే సరిచేసుకోసుకునే అవకాశముంటుందని గులాబీ బాస్‌‌ భావిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 12వేల పైచిలుకు పంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశముంది. ఇందులో 4300 కొత్త పంచాయతీలు ఉన్నాయి. కొత్త పంచాయతీలు మొత్తం టీఆర్‌ఎస్‌ వైపే ఉంటాయని అంచనా వేస్తున్నారు. పాత పంచాయతీల్లోనూ అధిక శాతం టీఆర్‌ఎస్‌ చేతిలోనే ఉన్నాయని, రైతుబంధు, రైతుబీమా పథకాలతో గ్రామాల్లో వాతావరణం పూర్తిగా టీఆర్‌ఎస్‌కు పాటిజివ్‌గా మారిందని భావిస్తున్నారు. దాంతో సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను మట్టి కరిపిస్తే సార్వత్రిక ఎన్నికల్లో ఎదురే లేకుండా పోతుందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఇప్పటికిప్పుడు ప్రతిపక్షాలు బలపడే అవకాశం లేదని అంచనా వేస్తోన్న గులాబీ పార్టీ సర్పంచ్‌ ఎన్నికల్లోనే తమ సత్తా చూపాలని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories