అవిశ్వాసంపై చర్చకు వస్తే సహకరిస్తాం..

అవిశ్వాసంపై చర్చకు వస్తే సహకరిస్తాం..
x
Highlights

టీఆర్ఎస్‌ పార్టీ కీలక నిర్ణ‍యం తీసుకుంది. కేంద్రంపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్ధతిస్తున్నట్టు ప్రకటించింది. ప్రగతి భవన్‌లో పార్టీ...

టీఆర్ఎస్‌ పార్టీ కీలక నిర్ణ‍యం తీసుకుంది. కేంద్రంపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్ధతిస్తున్నట్టు ప్రకటించింది. ప్రగతి భవన్‌లో పార్టీ ఎంపీలతో సమావేశమైన సీఎం కేసీఆర్‌ పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తమ వల్లే అవిశ్వాస తీర్మానం చర్చకు రావడం లేదంటూ వస్తున్న విమర్శలను ఎంపీలు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. రిజర్వేషన్ల అంశంపైనే టీఆర్ఎస్ పోరాడుతోందని దాన్ని సాకుగా చూపి లోక్ సభను వాయిదా వేస్తున్నారని సీఎంకు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్ధతుగా నిలచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టాలని ఎంపీలకు సూచించిన కేసీఆర్ ఓటింగ్ జరిగితే అప్పటి పరిస్ధితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

లోక్‌సభ వాయిదాకు టీఆర్‌ఎస్సే కారణమనడం సమంజసం కాదని, టీడీపీ అవిశ్వాసాన్ని టీఆర్‌ఎస్‌ అడ్డుకోవడం లేదని టీఆర్ఎస్‌ స్పష్టం చేసింది. బీజేపీని కాపాడాల్సిన అవసరం తమకు లేదని టీఆర్ఎస్‌ ఎంపీ కేశవరావు తెలిపారు. తమ పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తమకు తెలుసని, రిజర్వేషన్లపై వెల్‌లోకి వెళ్లకుండా ఆందోళనలు కొనసాగిస్తామని కేకే స్పష్టం చేశారు. తమ వల్ల అవిశ్వాసానికి ఆటంకం కలిగే పరిస్థితి రానివ్వమని టీఆర్ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రంలో కదలిక లేదని, తమ ఆందోళనను సాకుగా తీసుకుని, అవిశ్వాసాన్ని వాయిదా వేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. కేంద్ర ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచాలని కోరడం లేదని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు పెంచాలని కోరుతున్నామని జితేందర్‌ రెడ్డి చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories