కేసీఆర్‌ వారసులు ఎవరు?.. కవిత బదులిదే!

కేసీఆర్‌ వారసులు ఎవరు?.. కవిత బదులిదే!
x
Highlights

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం సాధిస్తుందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. 2019 ఎన్నికలు వన్‌సైడ్‌ జరుగుతాయన్న ఆమె తెలంగాణలో ఏ కూటములు ఏమీ...

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం సాధిస్తుందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. 2019 ఎన్నికలు వన్‌సైడ్‌ జరుగుతాయన్న ఆమె తెలంగాణలో ఏ కూటములు ఏమీ చేయలేమన్నారు. హరీశ్‌రావు పార్లమెంట్‌కు వెళతారన్న వార్తలు ఊహగానాలు మాత్రమేనన్నారు కవిత. కేసీఆర్‌ వారసుడ్ని భవిష్యత్తే నిర్ణయిస్తుందని ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే జరుగుతోందని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడే జరుగుతుందన్నారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. కేసీఆర్‌ ఎటువైపు ఉంటే...అటు వైపు గెలుపు ఉంటుందని కవిత స్పష్టం చేశారు. మీడియాతో చిటిచాట్‌ నిర్వహించిన కవిత..పలు కీలక అంశాలపై మాట్లాడారు. తెలంగాణలో భయంకరమైన ప్రతిపక్షముందని....ఇలాంటి ప్రతిపక్షం దేశంలో ఎక్కడా లేదన్నారు. ప్రభుత్వం మంచి చేయాలని చూస్తుంటే...ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. మా నాయకుడు పని చేసే నాయకుడన్న కవిత.....ఏ కూటములు ఏం చేయలేవన్నారు. ఒంటేరు ప్రతాప్‌రెడ్డిపై ఎలాంటి కక్ష లేదన్న ఆమె....ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు జరుగుతున్నాయని చెప్పారు.

కాంగ్రెస్‌ నుంచి టీఆర్ఎస్‌లో చేరడానికి చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారని కవిత తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల డీ-లిమిటేషన్‌పై ఇప్పుడే ఏం చెప్పలేమన్న ఆమె....ఎన్నికలు ఎంతో దూరం లేవన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చబోమని...మంచిగా పనిచేయాలని సీఎం కేసీఆరే చెప్పారని కవిత గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో హరీశ్‌రావు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తారన్న వార్తలు....ప్రచారం మాత్రమేనన్నారు. కేసీఆర్‌ వారసుడు ఎవరనేది భవిష‌్యత్తే నిర్ణయిస్తుందన్నారు.

తెలంగాణ కేబినెట్‌లో మహిళలకు స్థానం లేకపోవడం పెద్ద విషయం కాదని...పద్మ అవార్డుల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కవిత అన్నారు. పసుపు బోర్డు పోరాటంలో గెలిచామన్న కవిత....బొగ్గు గని కార్మికులకు న్యాయం చేసేందుకు ముసాయిదాను రూపొందించామన్నారు. అన్ని చట్టాల్లాగే 506, 507 యాక్ట్‌లను అమలు చేస్తామన్న ఆమె....24గంటల విద్యుత్‌పై ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories