పవన్ కల్యాణ్‌కి ఇక్కడ పోటీ చేసే హక్కు ఉంది!: ఎంపీ కవిత

పవన్ కల్యాణ్‌కి ఇక్కడ పోటీ చేసే హక్కు ఉంది!: ఎంపీ కవిత
x
Highlights

కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని ఎంపీ కవిత చెప్పారు. మీడియాతో సచివాలయంలో కాసేపు ముచ్చటించిన ఎంపీ కవిత...

కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని ఎంపీ కవిత చెప్పారు. మీడియాతో సచివాలయంలో కాసేపు ముచ్చటించిన ఎంపీ కవిత అసెంబ్లీ నియోజక వర్గాల డి లిమిటేషన్ పై ఇప్పుడేమీ చెప్పలేమన్నారు. పసుపు మద్దతు ధరపై కేంద్రంపై సాధ్యమైనంత ఒత్తిడి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. మహిళలకు కేబినెట్ లో స్థానం లేకపోవడం అంత పెద్ద విషయం కాదన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చబోమని స్వయంగా సీఎం చెప్పారని, వచ్చే ఎన్నికల్లో హరీశ్ పార్లమెంటుకి వెళతారన్నది ప్రచారమేనన్నారు.

ఇక తాను ఎమ్మెల్యేగానా? లేక ఎంపీగా పోటీచేయాలా? అనేది పార్టీనే నిర్ణయిస్తుందని చెప్పారు. అలాగే, కోదండరామ్ పార్టీ పెడితే స్వాగతిస్తామని అన్నారు. సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తెలంగాణలో పోటీ చేసే హక్కు ఉందని చెప్పారు. పవన్ కల్యాణ్ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. కాగా, విభజన సమస్యలను కేంద్ర ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories