Top
logo

చంద్రబాబుపై బాల్కసుమన్‌ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుపై బాల్కసుమన్‌ సంచలన వ్యాఖ్యలు
X
Highlights

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను అడ్డంపెట్టుకుని టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని...

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను అడ్డంపెట్టుకుని టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. గత 15 రోజులుగా హైదరాబాద్‌లో ఏపీ ఇంటెలిజెన్స్ చీప్ ఏపీ వెంకటేశ్వర్లు తిష్ట వేసి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతున్నారని విమర్శించారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీప్ ఏపీ వెంకటేశ్వర్లుపై గవర్నర్‌కు, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని, వారు చర్యలు తీసుకోకపోతే టీఆర్‌ఎస్ ప్రతీకార చర్యలకు దిగుతుందని బాల్క సుమన్ హెచ్చరించారు. ఇన్నాళ్లు చంద్రబాబుపై కేసులు వేసిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు చంద్రబాబు చేతులు పట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చీకటి రాజకీయాలు మానుకోవాలని బాల్క సుమన్‌ హితువుపలికారు.

Next Story