Top
logo

పరిపూర్ణానంద ప్రవచనాలు చెప్పుకుంటే మంచిది

పరిపూర్ణానంద ప్రవచనాలు చెప్పుకుంటే మంచిది
X
Highlights

పరిపూర్ణానంద గుడిలో ప్రవచనాలు చెప్పుకుంటే మంచిదని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని టీఆర్ఎస్...

పరిపూర్ణానంద గుడిలో ప్రవచనాలు చెప్పుకుంటే మంచిదని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్‌ పరిపూర్ణానందను హెచ్చరించారు. కర్నేప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు సుద్దఅబద్ధాలే చెబుతున్నారని బీజేపీపై ధ్వజమెత్తారు. ఆయుష్మాన్‌భవ పథకం కంటే అద్భుతమైన ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో అమలు అవుతోందని ఈ సందర్భంగా తెలిపారు. మార్చురీ నుంచి శవాలను తరలించే వాహనాలను ఏ రాష్ట్రంలోనైనా అమలు చేశారా? ఆ విషయం స్మృతి ఇరానీ చెప్పాలని కర్నె డిమాండ్ చేశారు. కేంద్రం ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చిందా అని బీజీపిని ప్రశ్నించారు. బీజేపీలో నేతలు లేరా? ఆంధ్రా నాయకులతో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. మతాలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని బీజేపీ చూస్తోందని కర్నె ప్రభాకర్ ఆరోపించారు.

Next Story