ఏ అమరుడు చెప్పాడని కోదండరామ్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు: కేటీఆర్‌

x
Highlights

ఢిల్లీ గులాములుగా ఉండాలా? అమరావతి బానిసల్లా ఉండాలా? తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సిన తరుణమిదన్నారు మంత్రి కేటీఆర్‌. అమరవీరుల గురించి మాట్లాడుతున్న...

ఢిల్లీ గులాములుగా ఉండాలా? అమరావతి బానిసల్లా ఉండాలా? తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సిన తరుణమిదన్నారు మంత్రి కేటీఆర్‌. అమరవీరుల గురించి మాట్లాడుతున్న కోదండరామ్‌... ఏ అమరుడు చెప్పాడని కోదండరామ్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారో చెప్పాలన్నారు. రైతులను కాల్చి చంపిన రాబందులు ఒక్కటయ్యాయన్న కేటీఆర్‌... టీఆర్‌ఎస్‌... మోడీకో, రాహుల్‌కో భయపడే పార్టీ కాదన్నారు. సోమవారం తెలంగాణభవన్‌లో నర్సంపేట నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి నాయకత్వంలో ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ బీరం సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉడుగుల సత్యనారాయణగౌడ్ సహా పలువురు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Minister KTR Comments On Kodandaram Over TJC Alliance With Congress

Show Full Article
Print Article
Next Story
More Stories