కాసేపట్లో టీఆర్ఎస్‌ పాక్షిక మేనిఫెస్టో..

కాసేపట్లో టీఆర్ఎస్‌ పాక్షిక మేనిఫెస్టో..
x
Highlights

ఎన్నికల మేనిఫెస్టోపై టీఆర్ఎస్‌ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు దఫాలు సమావేశమైన కమిటీ కేసీఆర్‌ సమక్షంలో మరోసారి భేటీ అయ్యింది. తెలంగాణభవన్‌లో...

ఎన్నికల మేనిఫెస్టోపై టీఆర్ఎస్‌ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు దఫాలు సమావేశమైన కమిటీ కేసీఆర్‌ సమక్షంలో మరోసారి భేటీ అయ్యింది. తెలంగాణభవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో ఎన్నికల ప్రణాళికకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. సమావేశం అనంతరం పాక్షిక మ్యానిఫెస్టోను కేసీఆర్‌ స్వయంగా ప్రకటించనున్నారు. ఇప్పటివరకు ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, విజ్ఞప్తులపై మేనిఫెస్టో కమిటీ సమావేశంలో చర్చించారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న టీఆర్ఎస్‌ అభ్యర్థులు, టీఆర్‌ఎస్ హామీలను వెంటనే ప్రజల్లోకితీసుకువెళ్లాలని నాయకత్వం యోచిస్తున్నది. ఈ క్రమంలోనే పూర్తిస్థాయి మ్యానిఫెస్టో సిద్ధమయ్యేలోపు ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్న కొన్నింటిని వెల్లడించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories