ఇవాళ కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు...ఢిల్లీకి చేరుకున్న డీఎస్‌, నర్సారెడ్డి, ఆర్‌.కృష్ణయ్య..

x
Highlights

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ ఇవాళ సొంత గూటికి చేరబోతున్నారు. డీఎస్‌తో పాటు టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత ఎమ్మెల్సీ రాములు నాయక్‌, గజ్వేల్‌ మాజీ...

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ ఇవాళ సొంత గూటికి చేరబోతున్నారు. డీఎస్‌తో పాటు టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత ఎమ్మెల్సీ రాములు నాయక్‌, గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూడా కాంగ్రెస్‌ కండువాలు కప్పుకోనున్నారు. అటు టీడీపీ ఎమ్మెల్యే , బీసీ నేత ఆర్.కృష్ణ‌య్య‌ కూడా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది.

రాజ్యసభ సభ్యుడు డీఎస్ ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. కొద్ది నెలలుగా టీఆర్ఎస్ అధిష్టనం వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న డీ. శ్రీనివాస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీఆర్ఎస్ లో వర్గపోరు కారణంగా ఆయన పార్టీని వీడుతున్నారు. అక్టోబర్ 11 తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరతానని ఇటీవల జరిగిన మున్నూరు కాపు సంఘం సమావేశంలో డీఎస్ ప్రకటించారు. చెప్పినట్లుగానే కారు దిగి.. హస్తం గూటికి చేరుతున్నారు.

ఇక 2014 టీడీపీ సీఎం అభ్యర్థి, బీసీ నేత‌, ఎల్.బి.న‌గ‌ర్ తాజా మాజీ ఎమ్మెల్యే , బీసీనేత ఆర్.కృష్ణ‌య్య కూడా కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే డిల్లీ చేరుకున్నారు. వ‌రుస చేరిక‌ల‌తో ఇప్ప‌టికే జోష్‌లో ఉన్న టీకాంగ్రెస్‌కు.. డీఎస్ సహా ముఖ్య నేతల రాక మరింత బూస్ట్‌నిస్తుందని పార్టీ శ్రేణ‌ులు సంబరపడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories