ఏపీ, తెలంగాణ మధ్య రాజకున్న కొత్త వివాదం

ఏపీ, తెలంగాణ మధ్య రాజకున్న కొత్త వివాదం
x
Highlights

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణ కలిసి రావాల్సిందేనా ? ఏపీ సర్కార్‌తో కలిసి కేసీఆర్‌ నడవకపోతే ఇబ్బందులు ఎదురవుతాయా ? హోదా ఉద్యమానికి...

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణ కలిసి రావాల్సిందేనా ? ఏపీ సర్కార్‌తో కలిసి కేసీఆర్‌ నడవకపోతే ఇబ్బందులు ఎదురవుతాయా ? హోదా ఉద్యమానికి సహకరించకపోతే...తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లంతా కేసీఆర్‌ను వ్యతిరేకిస్తారా ? టీజీ వెంకటేశ్ పిలుపునిచ్చినంత మాత్రాన తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తారా ? టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నేతలు ఏమంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పొలిటిషియన్ల మధ్య కొత్త వివాదం రాజుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో...ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ నేతలు, సమైక్య ఆంధ్రప్రదేశ్‌ కోసం ఏపీ నేతలు ఉద్యమాలు చేశారు. రాష్ట్ర విడిపోయిన తర్వాత ఓటుకు నోటు కేసు కేసీఆర్‌ తెరపైకి తెస్తే...చంద్రబాబు ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదంతో ముందుకు వచ్చారు. మధ్యలో ఎన్నో విషయాలు రెండు ప్రభుత్వాల మధ్య చిన్న చిన్న వివాదాలు తలెత్తినా....సద్ధు మణుగాయ్. తాజాగా ఏపీ, తెలంగాణ మధ్య కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న పోరాటంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతులు కలపాలని ఏపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని కేసీఆర్‌ మాట ఇచ్చారని, ధనిక రాష్ట్ర సీఎంగా కేసీఆర్‌ మాట నిలుపుకోవాలన్నారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో... హోదా కోసం చేసే పోరాటంలో టీఆర్ఎస్‌ పార్టీ మద్దతివ్వాలని టీజీ వెంకటేశ్ అన్నారు.

పార్లమెంట్ సమావేశాల్లో పోడియంలోకి వెళ్లి నిరసన తెలియజేస్తే...టీఆర్ఎస్‌ నేతలు కూడా వచ్చి నిరసన వ్యక్తం చేయాలన్నారు. ఒక వేళ టీఆర్‌ఎస్‌ పార్టీ సపోర్ట్ చేస్తుందని తెలిస్తే....ప్రధాని మోడీ అసలు సాయం చేయరన్నారు. మోడీ విభజించు పాలించు అన్న రీతిలో వెళ్తారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రానికి మద్దతివ్వరన్న సంకేతాలు కేసీఆర్‌ పంపాలన్నారు. రాబోయే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒకే తాటిపై ఉన్నారన్న సంకేతం వెళితే తప్ప కేంద్రం నుంచి ఏపీకి న్యాయం జరగదన్నారు.

కేసీఆర్‌ కలిసి రాకపోతే కర్ణాటక ఎన్నికల తరహాలోనే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటేయాలని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల ఓటర్లకు పిలుపునివ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. నీతి అయోగ్ సమావేశంలో అందరూ ముఖ్యమంత్రులు చంద్రబాబును కలిస్తే...కేసీఆర్‌ మాత్రం కలవలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్‌....చంద్రబాబును కలిసి ప్రత్యేక హోదా కోసం సంఘీభావం తెలిపి ఉంటే బాగుండేందని అభిప్రాయపడ్డారు.

టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీకైనా ఎన్నికలే ప్రామాణికమన్న ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌...ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌నే ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. టీఆర్ఎస్‌ పార్టీ శాంతి కోరుకుంటుందన్న ఆయన....భవిష్యత్‌లో టీజీ వెంకటేశ్ ఇలాగే ప్రవర్తిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు...టీజీ వెంకటేశ్‌ లాంటి నేతలను కంట్రోల్‌ చేయాలని కర్నె ప్రభాకర్ కోరారు. రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే...ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య ఆగాధం ఏర్పడే అవకాశం ఉందన్నారు. టీజీ లాంటి వ్యక్తులు రెచ్చగొట్టినంత మాత్రాన...హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఏపీ ఎంపీలతో ఉద్యమానికి టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతిస్తుందా ? లేదంటే సైలెంట్‌గా ఉంటుందో కాలమే సమాధానం చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories