టీఆర్ఎస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల

nanireddy
Updated on: 24 Dec 2018 4:06 PM IST
టీఆర్ఎస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల
X

టీఆర్ఎస్ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. కోదాడ, ముషీరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు సీఎం కేసీఆర్. కోదాడ స్థానానికి బొల్లం మల్లయ్య యాదవ్, అలాగే ముషీరాబాద్ స్థానానికి ముఠా గోపాల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు కేసీఆర్. ముఠా గోపాల్ కు స్వయంగా మంత్రి నాయని నరసింహారెడ్డి బీఫామ్ అందజేశారు. రేపు వీరు నామినేషన్ వేయనున్నారు. కాగా ముషీరాబాద్ సీటుకోసం నాయని నరసింహా రెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేశారు. తనకు కాదంటే తన అల్లుడు కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డికైనా టికెట్ ఇవ్వాలని ఆయన కోరారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినా ముఠా గోపాల్ కే అవకాశం దక్కింది.

nanireddy

nanireddy

Next Story