మా తాతకు ఓటెయ్యండి..

nanireddy
Updated on: 24 Dec 2018 3:50 PM IST
మా తాతకు ఓటెయ్యండి..
X

మహబూబ్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతుగా ఆయన భార్యతో పాటు కుమార్తె కూడా ప్రచారం నిర్వహిస్తోంది. శ్రీనివాస్ గౌడ్ పట్టణంలోని రామయ్య బౌలిలో జోరుగా ప్రచారం
నిర్వహిస్తున్నారు. అయితే అయనకు మద్దతుగా శ్రీనివాస్‌గౌడ్‌ మనుమరాలు సిద్దిక్ష సైతం ప్రచారానికి హాజరైంది. తన మనుమరాలితో కలిసి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రచారంలో పాల్గొనడం ఆకట్టుకుంది. సిద్ధిక్ష తన చిన్ని చిన్ని పలుకులతో జనాలను పలకరిస్తూ.. ప్రచార కార్డును వారికీ ఇస్తోంది. దాంతో పాపను చూసిన ఓటర్లు ముగ్ధులయ్యారు. ఇదిలావుంటే మహబూబ్ నగర్ నుంచి శ్రీనివాస్ గౌడ్ బరిలోకి దిగుతున్నారు. గతంలో కూడా ఆయన ఇక్కడినుంచి పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ ఆ తరువాత రాజకీయాల్లో చేరి రాణిస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story