Top
logo

కరీంనగర్ లో టీఆర్ఎస్, బిజెపిలకు షాక్

X
Highlights

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో టీఆర్ఎస్, బిజెపి పార్టీలకు షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు...

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో టీఆర్ఎస్, బిజెపి పార్టీలకు షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు, బిజెపికి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాడిజెర్రి టీఆర్ఎస్ ఎంపీటీసీ కొత్తూరు మణెమ్మ, లక్ష్మీదేవిపల్లి బిజెపి ఎంపీటీసీ పొన్నం విజయ, నారాయణపూర్ టీఆర్ఎస్ ఎంపీటీసీ మల్లేశం, ర్యాలపల్లి బిజెపి ఎంపీటీసీ లక్ష్మీనారాయణ పార్టీలకు రాజీనామా చేశారు. నాలుగేళ్లుగా ఎంపీటీసీలుగా ఉత్సవ విగ్రహాలుగా ఉన్నామని తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ లో కొత్త జైపాల్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తామని వారు చెప్పారు.

Next Story