మాపై దౌర్జన్యానికి దిగుతున్నారు : నందమూరి దీపిక

nanireddy
Updated on: 24 Dec 2018 4:24 PM IST
మాపై దౌర్జన్యానికి దిగుతున్నారు : నందమూరి దీపిక
X

ప్రచారంలో కొంతమంది టీఆర్‌ఎస్‌ నాయకులు తమ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగుతున్నారని.. హరికృష్ణ కోడలు నందమూరి దీపిక ఆరోపించారు. కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని తరపున ప్రచారం నిర్వహిస్తుండగా.. బాలాజీ నగర్‌లో కొంతమంది టీఆర్‌ఎస్‌ నాయకులు తమపై దౌర్జన్యానికి దిగినట్టు ఆమె తెలిపారు. మహిళలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడారన్నారు. ఓటమి భయంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఇలా చేస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు నందమూరి దీపిక. అలాగే కూకట్ పల్లి, శేరిలింగంపల్లిలో విజయం సాధించేది టీడీపీ అని జోస్యం చెప్పారామె.

nanireddy

nanireddy

Next Story