మరికొన్ని గంటల్లో 'ఈశాన్య' రాష్ట్రాల భవితవ్యం

మరికొన్ని గంటల్లో ఈశాన్య రాష్ట్రాల భవితవ్యం
x
Highlights

మూడు ఈశాన్య రాష్ట్రాల్లో కౌంటింగ్‌ స్టార్టయింది. మరి త్రిపుర, నాగాలాండ్, మేఘాలయాలో గెలుపెవరిది? మొత్తం 180 స్థానాలకు జరిగే ఓట్ల లెక్కింపులో అసలు సిసలు...

మూడు ఈశాన్య రాష్ట్రాల్లో కౌంటింగ్‌ స్టార్టయింది. మరి త్రిపుర, నాగాలాండ్, మేఘాలయాలో గెలుపెవరిది? మొత్తం 180 స్థానాలకు జరిగే ఓట్ల లెక్కింపులో అసలు సిసలు నాయకుడెవరు? నార్త్‌ఈస్ట్‌లో బెస్ట్‌ రిజల్ట్‌పై అన్ని పార్టీల ధీమాగా ఉన్నాయి. ఫలితాలే తమకే అనుకూలమని చెబుతున్నాయి. మూడు రాష్ట్రాల ఫలితాలు నేషన్‌ మూడ్‌కు సంకేతమా? ఈ ఫలితాలు కర్నాటక్‌ వార్‌పై, 2019 ఎన్నికలపై ఎలాంటి ప్రభావితం చేయబోతున్నాయి.

మూడు రాష్ట్రాలు.... ఒక్కో రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలు. ఈశాన్య రాష్ట్రాలపై కమలం గురిపెట్టింది. ఖాతా తెరుస్తామని కమలం కాన్ఫిడెన్స్‌గా ఉంది. మరి ఉత్తరాదిని ఊపేస్తున్న బీజేపీ ఈశాన్యంలో విజయనాదం చేస్తుందా? త్రిపురలో ఎర్రకోటలు బీటలువారతాయా? నాగాలాండ్‌లో పాగా వేస్తుందా? మేఘాలయా రాజ్యాన్ని చేజిక్కించుకుంటుందా? కర్ణాటక వార్‌కు విజయోత్సాహంతో వెళుతుందా?
ఏమైనా ఈశాన్య రాజకీయ చదరంగం రసపట్టుకు చేరింది.

మోడీ, అమిత్‌ షా ద్వయం, తర్వాతి టార్గెట్‌ ఈశాన్య రాష్ట్రాలేనా? అసలు ఒకప్పుడు బీజేపీ అంటే అక్కడ జీరో. కాషాయ పార్టీ అంటే
బహుశా జనాలకు పెద్దగా తెలీదేమో. నార్త్‌ఈస్ట్‌లో నలుచెరుగులా పాగా వేయాలన్నది బీజేపీ ప్లాన్‌. ఎప్పుడూ లేనిది అస్సాంలో ఖాతా తెరిచింది బీజేపీ. మణిపూర్‌లో రెండోస్థానంలో నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయాలో పువ్వు వికసిస్తుందా?

Show Full Article
Print Article
Next Story
More Stories