పాతబస్తీలో మరో తలాక్ కేసు..ఫోన్‌లో తలాక్ చెప్పిన భర్త
Highlights
హైదరాబాద్ పాతబస్తీలో మరో తలాక్ కేసు బయటికొచ్చింది. పహడీషరీఫ్‌కు చెందిన గౌసియా బేగంకు భర్త జహ్రాన్ అహ్మద్...
arun26 Dec 2017 11:20 AM GMT
హైదరాబాద్ పాతబస్తీలో మరో తలాక్ కేసు బయటికొచ్చింది. పహడీషరీఫ్‌కు చెందిన గౌసియా బేగంకు భర్త జహ్రాన్ అహ్మద్ ఫోన్‌లో తలాక్ చెప్పాడు. ఒమన్ దేశస్థుడైన జహ్రాన్ అహ్మద్ 2008లో గౌసియా బేగంను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికు ముందు 10 లక్షలు పెట్టి భార్యకు సొంతిల్లు కొనిస్తానని ఒప్పందం చేసుకొని మోసం చేశాడు. ఇప్పుడేమో ఒమన్ నుంచి ఫోన్ చేసి ఆమెకు తలాక్ చెప్పాడు. దీంతో బాధితురాలు గౌసియా బేగం తనకు న్యాయం చేయాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాసింది.
ఇంతకుముందు కూడా పాతబస్తీలో ఎన్నో తలాక్ కేసులు వెలుగుచూశాయి. సౌదీ అరేబియా, ఒమన్, దుబాయ్ నుంచి వచ్చిన షేక్‌లు కాంట్రాక్టు పెళ్లిళ్ల పేరుతో పాతబస్తీ అమ్మాయిల జీవితాలు నాశనం చేశారు. ఒప్పందం అయిపోగానే సింపుల్‌గా తలాక్ చెప్పేస్తున్నారు. తలాక్ చెప్పిన తర్వాత పాతబస్తీ యువతుల జీవితాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి.
లైవ్ టీవి
బొగ్గుగని శీనుతో కేథరిన్
14 Dec 2019 3:15 PM GMT'ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు' అందుకున్న సింగరేణి...
14 Dec 2019 3:04 PM GMTచంటి టు వెంకీమామ .. వెంకీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్
14 Dec 2019 2:35 PM GMTలేపాక్షి ఆలయాన్ని దర్శించుకున్న సీపీ సజ్జనార్
14 Dec 2019 2:15 PM GMTసానియా మీర్జాతో రామ్ చరణ్ డ్యాన్స్.. వీడియో వైరల్
14 Dec 2019 1:46 PM GMT