రగులుతున్న విశాఖ మన్యం

రగులుతున్న విశాఖ మన్యం
x
Highlights

విశాఖ మన్యం రగిలిపోతోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సోమేశ్వర్రావ్‌, మాజీ ఎమ్మెల్యే సివారి సోమ హత్యలతో.. ఏజెన్సీలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది....

విశాఖ మన్యం రగిలిపోతోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సోమేశ్వర్రావ్‌, మాజీ ఎమ్మెల్యే సివారి సోమ హత్యలతో.. ఏజెన్సీలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అరకు ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరి మృతదేహాలకు ఈ ఉదయం పోస్ట్‌మార్టం పూర్తి అయింది. కిడారి మృతదేహాన్ని అంబులెన్సులో పాడేరుకు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం కిడారి, సోమ అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో జరగనున్న అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటు ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు హాజరుకానున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో అరకుకు చేరుకోనున్నారు. ఇందుకోసం భారీ భద్రతను కల్పిస్తున్నారు.

మరోవైపు ఏజెన్సీలో జరుగుతున్న దారుణకాండకు నిరసనగా రెండు రోజుల పాటు మన్యం బంద్‌కు పిలుపునిచ్చాయి. మరోవైపు విశాఖ నుంచి 12 స్పెషల్‌ పార్టీ పోలీసులు అరకుకు చేరుకున్నాయి. మరోవైపు ఏవోబీలో కూంబింగ్‌ ముమ్మరంగా సాగుతోంది. 8 గ్రేహౌండ్స్‌ దళాలతో కూంబింగ్‌ కొనసాగుతోంది. ఇటు జరిగిన దారుణంపై పోలీసులు కూడా చర్యలు ప్రారంభించారు. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన డుంబ్రిగూడ ఎస్సై అమ్మన్‌రావుపై సస్పెన్షన్‌ వేటు పడింది. అమ్మన్‌రావును సస్పెండ్‌ చేస్తూ.. ఎస్సీ రాహుల్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories