వచ్చే జూన్2 నాటికి సీఎంగా కేసీఆర్ ఉండరు: ఉత్తమ్

వచ్చే జూన్2 నాటికి సీఎంగా కేసీఆర్ ఉండరు: ఉత్తమ్
x
Highlights

నాలుగేళ్ల తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబమే బాగుపడితే, ప్రజలకు దు:ఖం మిగిలిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన...

నాలుగేళ్ల తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబమే బాగుపడితే, ప్రజలకు దు:ఖం మిగిలిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని, నిలదీస్తే పోలీసులు కేసు పెడుతున్నారని ఆరోపించారు. గాంధీ భవన్ లో నిర్వహించిన తెలంగాణలో వేడుకల్లో ఉత్తమ్ కుమార్ పాల్గొన్నారు. తర్వాత కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన దగాపడ్డ తెలంగాణ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎన్నో అడ్డంకులు అధిగమించి తెలంగాణ ఇచ్చిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు ఉత్తమ్ కుమార్ . వచ్చే జూన్ 2 నాటికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండరని, కాంగ్రెస్ పార్టీనే అదికారంలోకి వస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది, తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నే అని ఉత్తమ్ స్పష్టం చేశారు. అయినా ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్షంగా ప్రజలపక్షాణ పోరాడుతున్నామని తెలిపారు. రైతురుణ మాఫీ చేస్తామని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఒక్క హామీని కూడా కేసీఆర్‌ అమలు చేయలేదని అన్నారు. ప్రశ్నించినవారిని జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories