Top
logo

కేసీఆర్ కిట్స్ లో చిరిగిన చీరలు

X
Highlights

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేసీఆర్ కిట్స్.. అచరణలో అబాసుపాలవుతోంది. బాలింతలకు ప్రభుత్వం...

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేసీఆర్ కిట్స్.. అచరణలో అబాసుపాలవుతోంది. బాలింతలకు ప్రభుత్వం తరుపున ఇస్తున్న కేసీఆర్ కిట్స్ లో నాసిరకం చీరలు, పాత చీరలను ఇవ్వడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. సూర్యాపేట ప్రభుత్వాస్పత్రిలో బాలింతలకు పంపిణి చేసిన కేసీఆర్ కిట్ లో చిల్లుల చీరలు, చిరిగిన దోమతెరలు రావడంపై మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ఎంతో అర్భాటంగా ప్రచారం చేసుకుంటూ.. ఆచరణలో మాత్రం చిరిగిన చీరలను, దోమతెరలను ఇచ్చి, తమను ఎందుకు అవమాన పరుస్తారని బాలింతలు ప్రశ్నిస్తున్నారు. సూర్యపేట ఆస్పత్రిలో లబ్ధిదారులకు ఇచ్చిన కేసీఆర్ కిట్లలో కొన్ని చీరలకు చిల్లుల పడగా, మరికొన్ని చీరలు పాతవి, నాసిరకం అని మహిళలు చెబుతున్నారు.

కేసీఆర్ కిట్లలలో నాణ్యత లేని చీరలు, దోమతెరలు వచ్చిన విషయాన్ని హెచ్ఎంటీవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే, అధికారులు మాత్రం.. చిన్న, చిన్న సమస్యలు ఉంటాయని సమాధానం ఇచ్చారు. ఇంత పెద్ద పథకం అమలు జరుగుతున్నప్పుడు లోపాలు ఉండటం సహజమే అంటున్నారు.

Next Story