వారసుల కోసం తిప్పలుపడుతున్న టాప్ హీరోలు

టాప్ హీరోల తన వారసులని లాంచ్ చేయడమంటే అదో మహాయజ్ఞం....తన కొడకుని హీరోగా లాంచ్ చేయలంటే, కత్తిలాంటి కథ, ఓరేంజ్...
టాప్ హీరోల తన వారసులని లాంచ్ చేయడమంటే అదో మహాయజ్ఞం....తన కొడకుని హీరోగా లాంచ్ చేయలంటే, కత్తిలాంటి కథ, ఓరేంజ్ డైరెక్టర్ ని వెతకాలి....కొన్నిసార్లు హీరోగా లుక్ బాలేకపోయినా, లాంచ్ అయ్యాక లక్ బాలేకపోయినా, తన మొహాన్నీ, కెరీర్ ని రిపేర్లు చేయాలి....ఓరకంగా వారసుడిని హీరోగా లాంచ్ చేయడమంటే , ఆహీరో తండ్రిది ప్రసవవేదనే.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని హీరోగా లాంచ్ చేసేప్పుడు, అల్లు అరవింద్ పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కావు....హీరోగా తనని ఎస్టాబ్లిష్ చేసేందుకు పడ్డ కష్టం అంతా ఇంతాకాదు.....ఇప్పుడు విక్రమ్ కూడా అదే పనిచేస్తున్నాడు...నటసింహం బాలక్రిష్ణ కూడా తన వారసుడు మోక్షగ్న లాంచింగ్ కోసం ఏడాది నుంచి ప్రిపరేషన్ పెంచాడు.
వారసులని హీరోలుగా లాంచ్ చేసేందుకు వాళ్ల తండ్రులు తిప్పలు పడుతున్నారు.....సొంత కెరీర్ , టైం పక్క నపెట్టి, కొడుకుల కెరీర్ కోసమే తెగ సతమతమౌతున్నారు. అఖిల్ ని ఫస్ట్ మూవీతో సరిగా లాంచ్ చేయలేకపోయిన నాగ్, ఈసారి తన వారసుడి ఫేట్ మార్చేందుకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ని ఎంచుకున్నాడు. అఖిల్ కొత్త మూవీ కోసమే ఏడాదిగా తపన పడుతున్నాడు.
అక్కినేని అఖిల్ ని మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ మేకింగ్ లొ హీరోగా లాంచ్ చేశాడు నాగ్... ఫస్ట్ మూవీనే 40 కోట్లతో గ్రాండ్ గా లాంచ్ చేస్తే రిలీజ్ బెడిసి కొట్టింది...అలాని ఊరుకోలేదు.... అఖిల్ ని హీరోగా మరింత పర్ఫెక్ట్ గా లాంచ్ చేసేందుకు మనం, 24 లాంటి హిట్స్ తో స్వింగ్ లో ఉన్న విక్రమ్ కుమార్ తో హెల్లో మూవీ తీయించాడు....
హెల్లో మూవీ ఫైనల్ ఔట్ పుట్ చూసి, క్వాలిటీకోసం రీషూట్లు చేయించాడునాగ్....ఈ మూవీతో అఖిల్ ఎలాగైనా హీరోగా హిట్ కొట్టాలని, తనని సెటిల్ చేయాలని నాగ్ తెగ కష్టపడుతున్నాడు....తానే రంగంలోకి దిగి, హెల్లోమూవీని ప్రమోట్ చేస్తున్నాడు.
అఖిల్ లాంచింగే కాదు, నాగచైతన్యని హీరోగా లాంచ్ చేసినప్పుడు కూడా నాగార్జున, తిప్పలు పడ్డాడు...అప్పట్లో దిల్ రాజు పట్టిందల్లా బంగారమౌైతోందని, తన చేతిలో చైతు ని పెట్టి జోష్ తీస్తే పోయింది. వెంటనే అరవ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో మూవీ ప్లాన్ చేస్తే, ఏదో మాయ చేశావే మూవీ హిట్టైంది...ఆతర్వాత కూడా చైతూకి కొన్ని ఫ్లాప్స్ వస్తే మళ్లీ రిపేర్లు చేయించేందుకు స్వింగ్ లో ఉన్న డైరెక్టర్లతో ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్ చేయించాల్సొచ్చింది.
నాగచైతన్య ఒక హిట్టు రెండు ప్లాపులతో సతమతమౌతున్నప్పుడు, మళయాల ప్రేమమ్ తెలుగులో రీమేక్ చేయించాడు నాగ్ ....అదుకోసం సక్సెస్ స్వింగ్ లో ఉన్న చందు మొండేటిని రంగంలోకి దింపాడు..ఆతర్వాత సోగ్గాడే చిన్నినాయన తో తనకి హిట్ ఇచ్చిన కళ్యాన్ ని రంగంలోకి దింపాడు..అలా ప్రేమమ్ తర్వాత, రారండోయ్ వేడుక చూద్దం లాంటి హిట్ వచ్చేలాచేశాడు....అలా చైతూని హీరోగా లాంచ్ చేసినప్పటినుంచి, కొడుకుకోసం కష్టపడుతూనే ఉన్నాడు.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT