డ్రగ్స్ వ్యవహారంలో కీలక మలుపు.. ముగ్గురి బ్లెడ్ శాంపిల్స్‌లో ఒకరిది పాజెటివ్‌..?

డ్రగ్స్ వ్యవహారంలో కీలక మలుపు.. ముగ్గురి బ్లెడ్ శాంపిల్స్‌లో ఒకరిది పాజెటివ్‌..?
x
Highlights

టాలీవుడ్ లో ప్రకంపణలు సృష్టించిన డ్రగ్స్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది దాదాపు నెల రోజులకు పైగా హాట్ టాపిక్ గా నడిచిన మాదక ద్రవ్యాల వినియోగం కేసులో...

టాలీవుడ్ లో ప్రకంపణలు సృష్టించిన డ్రగ్స్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది దాదాపు నెల రోజులకు పైగా హాట్ టాపిక్ గా నడిచిన మాదక ద్రవ్యాల వినియోగం కేసులో పలువురు సినీ ప్రముఖులను అకున్ సబర్వాల్ సారథ్యంలోని ఎక్సైజ్ సిట్ అధికారులు విచారించారు. అయితే సస్పెన్స్ కథని తలపించే రీతిలో సాగిన డ్రగ్స్ కథా చిత్రానికి త్వరలో ఎండ్ కార్డ్ పడనుంది ‎విచారణలో పలువురి బ్లెడ్ శాంపిల్స్ సేకరించిన సిట్ బృందం వాటిని కోర్టు ద్వారా ఎఫ్ఎస్ఎల్ కు పంపింది తాజాగా ఫోరెన్సిక్ పరిక్షలు ముగియటంతో నిపుణుల బృందం శాంపిల్స్ ను కోర్టుకు అందజేసింది. దీంతో త్వరలో చార్జిషీట్ కు సిద్ధమవుతుంది సిట్.

ఫోరెన్సిక్ సమర్పించిన నివేదికలో శాంపిల్స్ సేకరించిన వారి వివరాలను డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నదానిపై ఎఫ్ ఎస్ ఎల్ తను నివేదికను న్యాయస్దానానికి అందజేసింది. శాంపిల్స్ ఇచ్చిన వారిలో పూరి జగన్నాధ్, సుబ్బరాజు, తరుణ్ లు ఉండగా వీరిలో ఒకరి ఫోరెన్సిక్ రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చినట్టు సమాచారం. పూరిజగన్నాధ్, సుబ్బరాజు, తరుణ్ ల విచారణ సుమారు పది నుండి పదమూడు గంటల పాటు కొనసాగించిన సిట్ బృందం వీరి రక్త నమూనాలు, వెంట్రుకలు, గోర్లను పరిక్షల నిమిత్తం తీసుకుంది. డ్రగ్స్ పరిక్షల కోసం ప్రత్యేకించిన పరికరాలను దిగుమతి చేసుకున్న అధికారులు ఎట్టకేలకు రిజల్ట్ ను కోర్టును అందజేశారు. ఇక కోర్టు నుండి ఎక్సైజ్ అధికారులు సేకరించటమే తరువాయి తదుపరి చర్యలకు సిద్దం కానున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories