పవన్ డెడ్‌లైన్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ

పవన్ డెడ్‌లైన్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. పవన్ ఇచ్చిన అల్టిమేటంపై చర్చించేందుకు సినీ ప్రముఖులు ఇవాళ అన్నపూర్ణ...
పవన్ డెడ్‌లైన్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. పవన్ ఇచ్చిన అల్టిమేటంపై చర్చించేందుకు సినీ ప్రముఖులు ఇవాళ అన్నపూర్ణ స్టూడియోలో భేటీకావాలని భావించారు. అయితే, తాము భేటీకావడం కన్నా.. మంత్రి తలసానిని కలవాలని ఇండస్ట్రీ ప్రముఖులు నిర్ణయించారు. దీంతో పవన్ డెడ్ లైన్ పై ఎలాంటి సమాధనం ఇవ్వనున్నారనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్‌కు జనసేనాని విధించిన 24 గంటల డెడ్ లైన్ కాసేపట్లో ముగియనుంది. ఈ నేపధ్యంలో టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారిన శ్రీ రెడ్డి ఎపిసోడ్‌కు ఎలాంటి ముగింపు పడనుంది ? ఇప్పటికే ఓ సారి పవన్‌కు క్షమాపణ చెప్పిన శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మలు మరోసారి క్షమాపణ చెబుతారా ? లేక పవన్ తల్లిని స్వయంగా కలిసి క్షమాపణ కోరుతారా ? అనేది ఆసక్తిగా మారింది. అసలు మా పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ? ఇందుకు పవన్ కళ్యాణ్ ఎంత మేరకు అంగీకరిస్తాడనేదిపై అటు సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై తెలుగు చిత్ర పరిశ్రమ భేటీ కావాలని నిర్ణయించింది. అన్నపూర్ణ స్టూడియోలో భేటి కావాలని నిర్ణయించినా .. చివరి నిమిషంలో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు సభ్యులు ప్రకటించారు. అయితే ఈ రోజు సాయంత్రం మంత్రి తలసాని నిర్వహిస్తున్న సమావేశానికి హాజరుకావాలని సినీ ప్రముఖులు నిర్ణయించారు.
అయితే ఈ వివాదాన్ని ఒక్క క్షమాపణలకే పరిమితం చేయరాదని మెగా ఫ్యామిలి భావిస్తోంది. తమపై ఆరోపణలు చేయడం దర్శకుడు వర్మ పరిపాటిగా మారిందంటూ మెగా హీరోలు మండిపడుతున్నారు. సందర్భం కాకపోయినా .. అవసరం ఉన్నా లేకపోయినా తమను టార్గెట్ చేస్తూ వర్మ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. తమతో పాటు కుటుంబ సభ‌్యులపైన ... సభ్యత మరచి దూషణలు చేయడం వెనక పెద్ద కుట్రే ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తమను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నంలో వర్మ కూడా భాగంగా మారరంటూ మెగా ఫ్యామిలి భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపధ్యంలోనే ఈ వివాదాన్ని తెగే దాకా లాగాలని ఏకమైన మెగా ఫ్యామిలి నిర్ణయించింది.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT