నేడు టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

nanireddy
Updated on: 24 Dec 2018 4:32 PM IST
నేడు టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ
X

కొత్తగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నేడు (బుధవారం) ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో జరగనుంది. ఈ భేటీలో టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సీఎంగా కేసీఆరే ఉంటారని ఆ పార్టీవర్గాలు స్పష్టం చేసిన నేపథ్యంలో శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈవారంలోపే తెలంగాణ సీఎంగా రెండవసారి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని టీఆరెస్ వర్గాలు భావిస్తున్నాయి. నిన్న ఎన్నికల ఫలితాల అనంతరం ముందుగా తెలంగాణ భవన్‌ చేరుకున్న కేసీఆర్‌... తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడి.. తర్వాత నేరుగా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో కలిసి గవర్నర్‌ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఈ భేటీలోనే ప్రమాణస్వీకార ముహుర్తాన్ని గవర్నర్ కు చెప్పినట్టు సమాచారం.

nanireddy

nanireddy

Next Story